ఏపీ ఉద్యోగులకు తీపి కబురు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో తీపి కబురు అందనుంది. ప్రభుత్వం పీఆర్సీపై ప్రకటన చేసే అవకాశం ఉంది.

Update: 2021-11-25 13:40 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో తీపి కబురు అందనుంది. ప్రభుత్వం పీఆర్సీపై ప్రకటన చేసే అవకాశం ఉంది. డిసెంబరు 10 వ తేదీ లోగా పీఆర్సీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సచివాలయం సంఘ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఈ మేరకు తమకు ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.

వచ్చే నెల పది లోగా....
పీఆర్సీపై ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు పలు విడతలు చర్చలు జరిపింది. వారి అభిప్రాయాలను తీసుకుంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే పీఆర్సీని ప్రకటించే అవకాశముంది. వెనువెంటనే పీఆర్సీ ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేస్తుందని వెంకట్రామిరెడ్డి తెలిపారు.


Tags:    

Similar News