పోలవరం విషయంలో గ్రేట్ రిలీఫ్
పోలవరం విషయంలో ఏపీ ప్రభుత్వానికి రిలీఫ్ లభించింది. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పట్ల సానుకూల నిర్ణయం తీసుకుంది.
పోలవరం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిలీఫ్ లభించింది. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పట్ల సానుకూల నిర్ణయం తీసుకుంది. పర్యావరణ అనుమతులను మరో రెండేళ్ల పాటు పొడిగించడంతో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించినట్లయింది. అనుమతులు లేవంటూ 2011లో పోలవరం ప్రాజెక్టు పనులను నిలుపుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
2024 వరకూ....
అయితే తర్వాత రాష్ట్ర విభజన అనంతరం ఈ ఉత్వర్వులను సడలించుకుంటూ వెళుతుంది. ఈసారి మరో రెండేళ్ల వరకూ పర్యావరణ అనుమతులను పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే 2024 వరకూ పర్యావరణ అనుమతులు పోలవరం ప్రాజెక్టుకు లభించినట్లే.