పీఆర్సీ అంతే.. అంతకు మించి ఇవ్వలేను

ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది. 23.29 శాతం ఫిట్ మెంట్ ను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2022-01-07 11:57 GMT

ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది. 23.29 శాతం ఫిట్ మెంట్ ను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జగన్ స్వయంగా ఉద్యోగులకు తెలిపారు. రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచుతూ జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. 2020 ఏప్రిల్ నుంచి కొత్త పీఆర్సీ అమలులోకి రానున్నట్లు జగన్ తెలిపారు. పెండింగ్ లో ఉన్న డీఏలను జనవరి నుంచి చెల్లించనున్నారు.

జనవరి నుంచి....
ఈ జనవరి నుంచి పెంచిన కొత్త జీతాలను ప్రభుత్వం చెల్లించనుంది. పీఆర్సీని 2018 జులై 1 నుంచి అమలు కానుంది. సీపీఎస్ పై జూన్ 30లోగా నిర్ణయం తీసుకోనున్నాట్లు జగన్ వెల్లడించారు. సొంత ఇల్లులేని ప్రభుత్వ ఉద్యోగులకు జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్ లోనూ, ఎంఐజీ లే అవుట్స్ లోని ప్లాట్లలో పది శాతం రిజర్వ్ చేస్తామని జగన్ చెప్పారు. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికి జూన్ 20 వతేదీలోగా ప్రొబిషన్, కన్ఫర్మేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు.


Tags:    

Similar News