ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు

Update: 2023-12-23 08:27 GMT

Chandrababu

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, దాన్ని అనుసంధానించే ఇతర రోడ్ల అలైన్ మెంట్ లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో ఏపీ సీఐడీ చంద్రబాబు సహా పలువురిపై కేసు నమోదు చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబును ఏ1 గా పేర్కొంటూ విచారణ చేపట్టింది. దీంతో ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు సెప్టెంబర్ లో హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు శుక్రవారం ఏపీ సీఐడీ, చంద్రబాబు తరఫు లాయర్లు సమర్పించిన లిఖితపూర్వక వాదనలు పరిశీలించింది. శనివారం తీర్పును రిజర్వ్ చేస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది.

ఇక టీడీపీ యువనేత నారా లోకేశ్ ను అరెస్ట్ చేసేందుకు తమకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. రెడ్ బుక్ లో మీ పేర్లు రాశానని చెపుతూ పోలీసు విచారణ అధికారులను లోకేశ్ బెదిరిస్తున్నారని పిటీషన్ లో పేర్కొంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు కేసుల్లో ఉన్న దర్యాప్తు అధికారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని, జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని సీఐడీ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. సాక్ష్యాలుగా పేపర్ కటింగ్ లను కోర్టుకు ఆయన చూపించారు. ఐఆర్ఆర్ కేసులో 41ఏ కింద లోకేశ్ కు నోటీసులు ఇచ్చి విచారిస్తున్నామని, కోర్టు నిబంధనలను ఉల్లంఘించినందుకు లోకేశ్ ను అరెస్ట్ చేసేందుకు అనుమతిని ఇవ్వాలని కోరారు.


Tags:    

Similar News