అమరావతి శాసన రాజధాని.. బొత్స కామెంట్స్

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు;

Update: 2022-03-07 08:17 GMT

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 వరకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మాత్రమేనని అన్నారు. దానిని దృష్టిలో పెట్టుకునే న్యాయస్థానం ఆ వ్యాఖ్యలు చేసి ఉంటుందని బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్దారు. అమరావతిని తమ పార్టీ శాసన రాజధానిగా మాత్రమే పరిగణిస్తుందని తెలిపారు. తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు.

గవర్నర్ ప్రసంగాన్ని....
టీడీపీకి ఒక విధానం అంటూ ఏమీ లేదని బొత్స సత్యనారాయణ మండి పడ్డారు. తొలుత సభకు రానని చెప్పిన టీడీపీ తర్వాత గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుందని చెప్పారు. సభలో టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని చెప్పారు. జిల్లాల విభజనతో పరిపాలన సౌలభ్యం ఏర్పడుతుదని చెప్పారు. శివరామకృష్ణ కమిటీ ప్రధాన సూచన వికేంద్రీకరణ అని బొత్స సత్యనారాయణ మరోసారి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు.


Tags:    

Similar News