Nara Lokesh: అమెరికాకు నారా లోకేష్
ఏపీ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు
ఏపీ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అక్టోబర్ 25 నుంచి నవంబరు 1 వరకు నాటా లోకేష్ అమెరికాలో పర్యటించనున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో ఐటీ సర్వ్ సినర్జీ సదస్సుకు నారా లోకేష్ హాజరుకానున్నారు. ఈ కాన్ఫరెన్స్ సందర్భంగా, ఏపీకి పెట్టుబడులు ఆకర్షించేందుకు వివిధ కంపెనీల ప్రతినిధులతో లోకేశ్ సమావేశం కానున్నారు. దీంతో లోకేశ్ అమెరికా పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. అమెరికా పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్ ప్రముఖ టెక్ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు.
మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీస్(టీసీఎస్)ను ఒప్పించినట్టు ఇటీవల తెలిపారు. విశాఖలో టీసీఎస్‌ను ఏర్పాటు చేసేందుకు టాటా ముందుకు వచ్చినట్టు చెప్పారు. 10 వేల ఐటీ ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని నారా లోకేష్ తెలిపారు. త్వరలోనే మరిన్ని ప్రఖ్యాత ఐటీ కంపెనీలు రప్పించి లక్షలాది మందికి స్థానికంగా ఉపాధి కల్పిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు.