రూ.30 కోట్లు.. అమరావతిలో ఇల్లు.. టీడీపీ ఆఫర్

ఏపీ మంత్రి రాజన్న దొర సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో చేరితే తనకు 30 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారని ఆయన తెలిపారు;

Update: 2022-07-02 03:47 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి రాజన్న దొర సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో చేరితే తనకు 30 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారని ఆయన తెలిపారు. 2014 ఎన్నికల్లో రాజన్న దొర వైసీపీ నుంచి గెలుపొందారు. ఆ సమయంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారు. వారిలో నలుగురికి మంత్రి పదవులను కూడా ఇచ్చారు. అయితే తాజాగా రాజన్న దొర తనను కూడా టీడీపీలో చేరమని ప్రలోభపెట్టారని ఆయన తెలిపారు.

జగన్ వెంటే ఉన్నందుకు...
ిపిల్లల చదువులతో పాటు ముప్పయి కోట్లు, అమరావతిలో ఒక ఇల్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు రాజన్న దొర తెలిపారు. అయితే తాను జగన్ పై ఉన్న నమ్మకంతో పార్టీని వీడలేదని ఆయన తెలిపారు. విజయనగరం జిల్లా స్థాయి ప్లీనరీలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. కానీ టీడీపీలోకి వెళ్లకుండా వెయిట్ చేసినందుకు తనకు మంత్రి పదవితో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కిందని ఆయన వివరించారు.


Tags:    

Similar News