వారిపై అనర్హత వేటు వేసేసిన ఏపీ స్పీకర్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం 8 మంది రెబల్‌ ఎమ్మేల్యేలపై

Update: 2024-02-27 03:12 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం 8 మంది రెబల్‌ ఎమ్మేల్యేలపై అనర్హత వేటు వేశారు. వైసీపీ, టీడీపీ ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ లపై విచారణ జరిపిన స్పీకర్‌, ఆ తర్వాత న్యాయ నిపుణుల సలహా తీసుకున్నారు. తాజాగా వారిపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు పిటిషన్లు ఇచ్చాయి వైసీపీ, టీడీపీ. వైసీపీ పిటిషన్ లో ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కొటంరెడ్డీ శ్రీధర్ రెడ్డీ, ఉండవల్లి శ్రీదేవి ఉండగా.. టీడీపీ పిటిషన్‌లో మద్దాల గిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ ఉన్నారు.

పార్టీ ఫిరాయించిన 8 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఒకేసారి అనర్హత వేటు వేశారు. వైఎస్సార్‌సీపీ నుంచి శాసనసభకు ఎన్నికై పార్టీ ఫిరాయించిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరుతూ వైసీపీ చీఫ్‌ విప్‌ ముదునూరు ప్రసాదరాజు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా విజయం సాధించి పార్టీకి దూరంగా ఉంటున్న వాసుపల్లి గణేష్‌కుమార్‌, కరణం బలరాం, మద్దాల గిరి, వల్లభనేని వంశీపై అనర్హత వేటు వేయాలని టీడీపీ విప్‌ డోలా బాల వీరాంజనేయస్వామి కూడా స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.


Tags:    

Similar News