రానున్న మూడ్రోజుల్లో ఏపీకి వర్షసూచన
రాబోయే మూడ్రోజుల్లో ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో వాతావరణం పొడిగానే ఉంటుందని పేర్కొన్నారు. దక్షిణ కోస్తాంధ్రలో..
బంగాళాఖాతం, చివరి దక్షిణ ద్వీపకల్ప భారతదేశం మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య గాలులు వీచే అవకాశం ఉంది. ఈ ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో అక్టోబర్ 29, 2022 నుండి వర్షాలు ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. మరోవైపు ఉత్తర తమిళనాడు తీరంలో నైరుతి బంగాళాఖాతం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రానున్న మూడ్రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
రాబోయే మూడ్రోజుల్లో ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో వాతావరణం పొడిగానే ఉంటుందని పేర్కొన్నారు. దక్షిణ కోస్తాంధ్రలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశమున్నట్లు తెలిపారు. అలాగే..రానున్న మూడ్రోజుల్లో రాయలసీమలో ఒకట్రెండు ప్రాంతాల్లో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశమున్నట్లు వివరించారు. వర్షసూచన నేపథ్యంలో రైతులు, ్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.