Ys Sharmila : చంద్రబాబు సర్కార్ కు వైఎస్ షర్మిల సూటి ప్రశ్నలు
రేషన్ బియ్యం అక్రమాలపై విచారణకు స్పెషల్ సిట్ వేయడం సంతోషమని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు
రేషన్ బియ్యం అక్రమాలపై విచారణకు స్పెషల్ సిట్ వేయడం సంతోషమని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఆమె ఎక్స్ లో స్పందించారు. సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన రూ.1750 కోట్ల ముడుపులపై విచారణ ఎక్కడ ? అంటూ ప్రశ్నించారు. బియ్యం మాఫియాపై పెట్టిన శ్రద్ధ.. అదానీ అక్రమ డీల్ పై ఎందుకు పెట్టలేక పోతున్నారన్నారు. అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలకు విలువ లేదా ? మాజీ ముఖ్యమంత్రి స్వయంగా లంచాలు తీసుకున్నారని నివేదిక ఇస్తే , నిజాలు నిగ్గు తేల్చే బాధ్యత మీది కాదా? మీరు కూడా అదానీకి అమ్ముడుపోయారా? తీగ లాగితే మాజీ ముఖ్యమంత్రితో పాటు, అదానీని సైతం అరెస్టు చేయాల్సి వస్తుందని భయపడుతున్నారా? నోరు విప్పకుండా, విచారణ చేయకుండా మౌనంగా ఉండేందుకు అదానీ మీకు ఎంత లంచాలు ఆఫర్ చేశారు? అంటూ కూటమిప ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు.