Tirumala : తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్... ఇక సులువుగా దర్శనం

తిరుమల వెళ్లే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల దర్శనం సులభంగా అయ్యేలా ఏపీఎస్ఆర్టీసీతో లింక్ చేశారు

Update: 2024-12-06 03:55 GMT

తిరుమల వెళ్లే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల దర్శనం సులభంగా అయ్యేలా ఏపీఎస్ఆర్టీసీతో లింక్ చేశారు. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు వెళ్లే ప్రయాణికుల కోసం రోజుకు వెయ్యి దైవ దర్శనం టిక్కెట్లు జారీ చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అంగీకరించింది. బస్సుల్లో తిరుమలకు వెళ్లే ప్రయాణికులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ అవకాశం కల్పించారు. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో తిరుపతికి వెళ్లే ప్రయాణికులు మూడు వందల రూపాయలుఅదనంగా చెల్లించి బస్సులోనే ఎక్స్‌ప్రెస్ దర్శనం టికెట్ పొందవచ్చు.

శీఘ్రదర్శనం తర్వాత...
ఈ శీఘ్ర దర్శనం ప్రతిరోజూ ఉదయం గంటల నుంచి మరియు సాయంత్రం నాలుగు గంటలకు ఉంటుందని అధికారులు తెలిపారు. తిరుమల బస్టాండ్‌కు చేరుకున్నప్పుడు ఆర్టీసీ సూపర్‌వైజర్లు ప్రయాణికులకు శీఘ్ర దర్శనానికి సహకరిస్తారు.కావున తిరుపతికి వెళ్లే ప్రయాణికులు ముందుగా ఆర్టీసీ బస్సుల్లో ఎక్స్‌ప్రెస్ దర్శనం టిక్కెట్లు పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఏపీఎస్ ఆర్టీసీ రోజుకు తిరుమలకు 600 బస్సులను నడుపుతుంది. ఏపీలో ప్రతి డిపో నుంచి ఈ బస్సులు బయలుదేరతాయి. దీంతోపాటు బెంగళూరు, కంచి, చెన్నై, వెల్లూరు, పుదుచ్చేరి, హైదరబాద్ నగరం నుంచి తిరుమలకు చేరుకునే వారికి ఈ సౌకర్యం కలుగుతుంది.


ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now

Tags:    

Similar News