ఏసీబీ కోర్టులో చంద్రబాబు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన అభియోగాలు
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు పెద్ద దుమారం రేపుతోంది. చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో పెను తుఫాను రేపింది. చంద్రబాబును ..
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు పెద్ద దుమారం రేపుతోంది. చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో పెను తుఫాను రేపింది. చంద్రబాబును నిన్న అరెస్టు చేసి తాడేపల్లిలోని సిటట్ ముందు హాజరు పర్చింది ఏసీబీ. దీంతో సిట్ అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. అయినా చంద్రబాబు నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదని సిట్ అధికారులు తెలిపారు. ఇక తాజాగా చంద్రబాబును పోలీసులు ఏసీబీ కోర్టులో హాజరు పర్చారు. కోర్టులో రిమాండ్ రిపోర్ట్‌ను సైతం సమర్పించారు సీఐడీ లాయర్లు.
సీఐడీ తరపున లాయర్లు వాదనలు వినిపిస్తున్నారు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్, సీఐడీ న్యాయవాదులు వివేకాచారి, వెంకటేష్, చంద్రబాబు తరపున లాయర్లు కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. అయితే నిన్న రాత్రి చంద్రబాబుకు సంబంధించిన లాయర్ల కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా, దానిని కోర్టు తిరస్కరించింది. చంద్రబాబు నాయుడిపై సీఐడీ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన అభియోగాలు చేసింది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉందని సీఐడీ చెబుతోంది. చంద్రబాబు ఆదేశాల మేరకే డబ్బులు విడుదలయ్యాయని, ఏసీబీ కోర్టులో హోరాహోరీగా వాదనలు నడుస్తున్నాయి. ఇక నారా లోకేష్ సైతం కోర్టులోనే ఉన్నారు. చంద్రబాబు తరఫున వాదనలు వినిపిస్తున్నారు. లాయర్ సిద్ధార్థ్ లూథ్రా
ఈ నేపథ్యంలో కోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించి ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి భద్రతతో కట్టుదిట్టం చేస్తున్నారు. కోర్టు ఆవరణలో భారీకేడ్లు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే చంద్రబాబును సీఐడీ అధికారులు శనివారం సాయంత్రం నుంచి విచారణ ప్రారంభించారు. శనివారం సాయంత్రం 5.10 గంటల నుంచి ఆదివారం ఉదయం 3 గంటల వరకు విచారణ సాగింది. చంద్రబాబును ఏకంగా 10 గంటల పాటు విచారించారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం 3 గంటల వరకు చంద్రబాబు నాయుడు సిట్ కార్యాలయంలో ఉన్నారు.
అనంతరం ఉదయం 3 గంటలకు సిట్ కార్యాలయం నుంచి బాబును ఆసుపత్రికి తరలించారు. ఉదయం 3.40 గంటలకు విజయవాడలోని సీజీహెచ్‌కి చంద్రబాబు కాన్వాయ్ చేరుకుంది. అనంతరం వైద్యులు 4.20కి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక తిరిగి 4.20 గంటలకు వైద్యులు మరోసారి పరీక్షలు నిర్వహించారు. తర్వాత మళ్లీ 4.30 గంటలకు తిరిగి సిట్ కార్యాలయానికి తరిలించారు. ఉదయం 4.45 గంటలకు బాబు సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. 5.50 గంటలకు సిట్ ఆఫీస్ నుంచి ఏసీబీ కోర్టుకు తరలించారు. ఉదయం 5.58 గంటలకు బాబు కోర్టుకు చేరుకున్నారు. ప్రస్తుతం కోర్టులో వాదనలు, ప్రతి వాదనలు కొనసాగుతున్నాయి.