Andhra Pradesh : ఏపీ డీజీపీగా ఆయనేనట.. ఆయన పేరు కన్ఫర్మ్ అయ్యే అవకాశం

ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డిపై బదిలీ వేటు పడటంతో ప్రస్తుతం కొత్త డీజీపీ ఎవరవుతారన్న దానిపై ఆసక్తి నెలకొంది.;

Update: 2024-05-06 02:09 GMT
dwarka tirumala rao, dgp,  responded, pawan kalyan comments
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డిపై బదిలీ వేటు పడటంతో ప్రస్తుతం కొత్త డీజీపీ ఎవరవుతారన్న దానిపై ఆసక్తి నెలకొంది. కేవలం పోలీసు వర్గాల్లోనే కాకుండా ఎన్నికల సమయం కావడంతో రాజకీయవర్గాల్లో కొత్త డీజీపీ ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. రాజేంద్ర నాధ్ రెడ్డిని వెంటనే విధుల నుంచి రిలీవ్ కావాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఆయన నిన్ననే విధుల నుంచి తప్పుకున్నారు. ఈరోజు ఉదయం పదకొండు గంటల లోపు ముగ్గురు సీనియర్ అధికారుల పేర్లతో జాబితాను పంపాలని ఎన్నికల కమిషన్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని ఆదేశించింది.

ముగ్గురి పేర్లలో...
అయితే ముగ్గురిలో ముందు ద్వారకా తిరుమలరావు పేరు ఉండే అవకాశాలున్నాయని తెలిసింది. ఆయననే నూతన డీజీపీగా నియమించే అవకాశాలున్నాయని సమాచారం. ద్వారకాతిరుమలరావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. సీనియారిటీ చూసుకుంటే ద్వారకా తిరుమలరావుకే ఎక్కువ ఛాన్స్‌లు ఉంటాయని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 1990 బ్యాచ్ కు చెందిన ద్వారకాతిరుమలరావు సీనియారిటీ ప్యానల్ లో చోటు దక్కించుకున్నారు. ఆయన పేరు ఖరారయ్యే అవకాశాలున్నాయి.


Tags:    

Similar News