YSRCP : వైసీపీలో జోరుగా చేరికలు.. పిఠాపురం నేతతో పాటు కాపు నేతలు
ఎన్నికల వేళ వైసీపీలో చేరికలు ఊపందుకున్నాయి. ఈరోజు వైసీపీలోకి పిఠాపురం జనసేన నేత శేషుకుమారి వైసీపీలో చేరారు;
ఎన్నికల వేళ వైసీపీలో చేరికలు ఊపందుకున్నాయి. ఈరోజు వైసీపీలోకి పిఠాపురం జనసేన నేత శేషుకుమారి వైసీపీలో చేరారు. ఆమె 2019 ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమె నేడు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈకార్యక్రమంలో వైసీపీ పిఠాపురం అభ్యర్థి వంగా గీత పాల్గొన్నారు. ఆమెను సాదరంగా జగన్ పార్టీలోకి ఆహ్వానించారు.
వంగవీటి నరేంద్ర కూడా...
అలాగే రాధా రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర కూడా వైసీపీలో చేరారు. రంగా హత్యకు కారణమైన టీడీపీతో కాపులు కలవరని, అందుకే తాను వైసీపీలో చేరానని ఆయన ప్రకటించారు. జగన్ సమక్షంలో నరేంద్ర పార్టీ కండువాను కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మరికొందరు రాధా - రంగా మిత్రమండలి సభ్యులతో పాటు వైసీీపీ రీజనల్ కో ఆర్డినేటర్ మిధున్ రెడ్డి కూడా పాల్గొన్నారు.