Breaking : కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ సీజ్
కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ ను అధికారుల సీజ్ చేశారు;
కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ ను అధికారుల సీజ్ చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారన్న ఆరోపణలపై ఈనెల 29వ తేదీన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించిన సంగతి తెలిసిందే. రేషన్ బియ్యం ఎగుమతి చేస్తున్న స్టెల్లా షిప్ ను సీజ్ చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. దీంతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది.
విచారణ కమిటీ...
స్టెల్లా షిప్ లో ఉన్న రేషన్ బియ్యమా? కాదా? అవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు తీసుకు వచ్చారు? వంటి వాటిపై విచారణ చేసేందుకు ఐదుగురితో కూడిన కమిటీని జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేశారు. పోలీసు, రెవెన్యూ, పౌరసరఫారల శాఖల, పోర్ట్, కస్టమ్స్ అధికారులతో కూడిన కమిటీ దీనిపై విచారణ జరపనుంది. ఆ షిప్ ను సీజ్ చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.