కడప వైసీపీ టిక్కెట్ మాకివ్వాల్సిందే
కడప నియోజకవర్గం ఎమ్మెల్యే టిక్కెట్ తమకు ఇవ్వాలని బలిజ సంఘం నేతలు డిమాండ్ చేశారు.;
కడప నియోజకవర్గం ఎమ్మెల్యే టిక్కెట్ తమకు ఇవ్వాలని బలిజ సంఘం నేతలు డిమాండ్ చేశారు. బలిజ సంఘం నేతలు సమావేశమై ఈ మేరకు వైసీపీ అధినాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. త్వరలోనే రాయలసీమ బలిజ సంఘం సమావేశం జరుగుతుందన్నారు. తాము వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచే ఆయన వెంట నడిచామని, జగన్ వెంట కూడా ఉన్నామని చెప్పారు. అయినా బలిజలను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు కాని, ప్రాధాన్యత కూడా దక్కడం లేదని వారు ఆవేదన చెందారు.
కార్పొరేషన్ ఎన్నికల్లోనూ...
కడప పట్టణంలో 58 వేల మంది బలిజ ఓటర్లున్నారని వారు గుర్తు చేశారు. అయినా కార్పొరేషన్ ఎన్నికల్లో 18 మంది మైనారిటీలకు, 15 మంది రెడ్డి సామాజికవర్గానికి మిగిలినవి బీసీలకు కేటాయించారన్నారు. వైసీపీలో సీనియర్ నేత తుమ్మలకుంట శివశంకర్ కు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలవడానికి కృషి చేసింది బలిజలేని వారు అన్నారు. కడప నియోజకవర్గం టిక్కెట్ ను బలిజలకు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.