పవన్ చేసిన పనిలో తప్పేముంది?
దేశ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు అందరు పని చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు;
దేశ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు అందరు పని చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. 2024 సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సమయం తక్కువ లోనే దేశ వ్యాప్తంగా 11కోట్ల మంది ని సభ్యత్వం చేయగలిగామన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీజేపీ కార్యకర్తలు 25లక్షల మంది సభ్యత్వాన్ని చేర్చారని పురంద్రీశ్వరి తెలిపారు. కార్యకర్త అంకితభావంతో పనిచేయటం వల్లనే ఇంత సభ్యత్వం నమోదు చేయగలిగామన్న ఆమె పారదర్శకంగా సమర్థవంతంగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని అన్నారు.
బీజేపీకి దేశ వ్యాప్తంగా...
బీజేపీ కి దేశవ్యాప్తంగా సానుకూల స్పందన ఉందన్నారు. దేశానికి సుపరిపాలన అందించటంలో, అవినీతి కి చోటు లేకుండా పరిపాలన అందించటంలో ప్రజలు గమనించారని పురంద్రీశ్వరి అన్నారు. హర్యానాలో, మహారాష్ట్ర లో కనివిని ఎరుగని రీతిలో విజయం సాధించామని తెలిపారు. అటువంటి స్పందన ప్రజల్లో ఉంది కాబట్టి అంత భారీ మెజారిటీ తో గెలిచామన్న పురంద్రీశ్వరి జార్ఖండ్ లో 33శాతం ఓట్ శాతం పెరిగిందన్నారు. బియ్యం అక్రమ రవాణాపై పవన్ కల్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఎక్కడికైనా వెళ్లవచ్చన్నారు. గతంలో తమ పార్టీ కూడా అక్రమంగా తరలి పోతున్న బియ్యంపై ప్రశ్నించామని చెప్పారు.