ఆ క్లారిటీ ఇచ్చేసిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

తాజాగా ఈ వార్తలపై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్పందించారు. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి..;

Update: 2022-04-22 12:03 GMT

కర్నూల్ : శాప్ ఛైర్మన్, వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పార్టీ మారబోతున్నారనే కథనాలు పెద్ద ఎత్తున వచ్చిన సంగతి తెలిసిందే..! నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్‌తో బైరెడ్డికి విభేదాలు ఉన్న కారణంగా.. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు బైరెడ్డి సిద్ధం అవుతున్నారని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఈ మధ్యే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో భేటీ అయ్యారనే వార్తలు రావడమే కాకుండా.. శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గాల బాధ్యతలు తీసుకుంటారని చర్చ కూడా సాగింది.

తాజాగా ఈ వార్తలపై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్పందించారు. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చెప్పుకొచ్చారు. కోర్టు వాయిదా వల్ల తిరుపతిలో శాప్ సమీక్షకు హాజరుకాలేదన్నారు. పార్టీ సిద్ధాంతాల కోసం పని చేస్తున్నానని, తనకు బ్రోకర్ రాజకీయాలు తెలియవన్నారు. కుటిల రాజకీయాలు ఎలా ఉంటాయో ఈవారంలో తెలుసుకున్నానని తెలిపారు. నందికొట్కూరు, పగిడ్యాలలో షటిల్ బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నందికొట్కూరులో పనులు తగ్గించామన్నారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్ధర్‌ది స్ధానిక ప్రోటోకాల్.. తనది రాష్ట్ర ప్రోటోకాల్ అని తెలిపారు. అందుకే ఇద్దరం కలవలేకపోతున్నామని చెప్పారు. తన ప్రోటోకాల్ పరిధిలోని కార్యక్రమాల్లో పాల్గొంటానని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తెలిపారు. నారా లోకేష్‌ను కలిసింది ఏ మీడియా చూసిందో.. ఆధారాలు ఉంటే తీసుకు రండి అని నిలదీశారు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. అమ్మ ఒడి, నాడు-నేడు.. ఇలా ఎమ్మెల్యే చేసే పనులకు నాకు సంబంధం లేదన్నారు సిద్ధార్థరెడ్డి. నందికొట్కూరు అభివృద్ధి కోసం రూ.16 కోట్లు మంజూరు చేయించానని తెలిపారు.

Tags:    

Similar News