వైఎస్ వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ వేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ వేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది ఈ హత్య కేసులో ఎర్రగంగిరెడ్డి బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తాడని సీబీఐ పిటీషన్ వేసింది. ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ పై విచారించిన హైకోర్టు సీబీఐ సిబీఐ పిటీషన్ కొట్టివేసింది.
సీబీఐ పిటీషన్ ను....
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎర్రగంగిరెడ్డి ప్రధాన నిందితుడు. సాక్షులను బెదిరించారనడానికి ఎటువంటి ఆధారాలు లేవని ఎర్రగంగిరెడ్డి తరుపున న్యాయవాది వాదించారు. సీబీఐ తరుపున న్యాయవాది కూడా తమ వాదనలను వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు సీబీఐ పిటీషన్ ను కొట్టివేసింది.