Breaking : జగన్ కు కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది.
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నిక చెల్లదని తెలిపింది. ఏ పార్టీలోనూ శాశ్వతమైన పదవులు ఉండవని పేర్కొంది. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొంది. అలాంటి ఎన్నిక నియమ నిబంధనలను ఉల్లంఘించినట్లేనని పేర్కొంది. వైసీపీ జనరల్ సెక్రటరీకి కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
వైసీపీ ప్లీనరీలో...
ఇటీవల జరిగిన ప్లీనరీలో వైఎస్ జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికయిన సంగతి తెలిసిందే. ప్లీనరీలో పార్టీ రాజ్యాంగాన్ని మార్చుకున్నారు. గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మను తొలగించి పూర్తి స్థాయిలో శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఎన్నికయ్యారని ప్రకటించారు. అయితే పార్టీ ప్లీనరీ సందర్భంగా జరిగిన ఈ ఎన్నిక చెల్లదంటూ కొందరు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయగా, ఎన్నికల కమిషన్ ఈ మేరకు స్పందించింది.