ఎన్నికల అనంతర హింసపై ఈసీ సీరియస్

ఎన్నికల అనంతరం జరుగుతున్న హింసపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది.

Update: 2024-05-15 12:29 GMT

ఎన్నికల అనంతరం జరుగుతున్న హింసపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. పోలింగ్ జరిగి మూడు రోజులయినా ఇంకా ఘర్షణలు కొనసాగుతుండటంపై నివేదిక కోరింది. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వెంటనే ఘర్షణలను అదుపులోకి తీసుకుని శాంతిభద్రతలను పర్యవేక్షించాలని డీజీపీ, చీఫ్ సెక్రటరీలను ఆదేశించింది.

అత్యవసర భేటీ...
ఈ నేపథ్యంలో సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డితో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా భేటీ అయ్యారు. డీజీపీతో పాటు సీఎస్ తో సమావేశమైన ఇంటిలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజిత్ కూడా ఉన్నారు. ⁠ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహించిన నేపథ్యంలో అత్యవసర భేటీ జరిగింది. రేపు ఈసీ వద్ద వివరణ ఇచ్చేందుకు సీఎస్, డీజీపీ ఢిల్లీ వెళ్లనున్నారని తెలిసింది.


Tags:    

Similar News