జగన్ లేఖకు రెస్పాన్స్.. కేంద్రంలో కదలిక
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందకు కేంద్ర బృందం రేపు ఆంధ్రప్రదేశ్ కు రానుంది.;
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందకు కేంద్ర బృందం రేపు ఆంధ్రప్రదేశ్ కు రానుంది. ఏడుగురు అధికారులతో కూడిన ఈ బృందం వరద తాకిడికి గురైన నాలుగు జిల్లాల్లో పర్యటించనుంది. రేపు కేంద్ర బృందం చిత్తూరు జిల్లాల్లో పర్యటిస్తుంది. శనివారం కడప జిల్లాలోనూ, ఆదివారం నెల్లూరు జిల్లాలో పర్యటిస్తుంది.
వరద నష్టాన్ని...
వరదల తాకిడికి జరిగిన నష్టాన్ని కేంద్ర బృందం అంచనా వేస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తక్షణ సాయం కింద వెయ్యి కోట్లు మంజూరు చేయాలని, వెంటనే కేంద్ర బృందాలను పంపాలని లేఖలో జగన్ కోరారు. జగన్ లేఖకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం తమ బృందాన్ని రేపు ఏపీికి పంపనుంది.