Andhra Pradesh : ఏపీకి నేడు కేంద్ర బృందం రాక
ఆంధ్రప్రదేశ్ కు నేడు కేంద్ర బృందం రానుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ బృందం పర్యటించనుంది;
ఆంధ్రప్రదేశ్ కు నేడు కేంద్ర బృందం రానుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ బృందం పర్యటించనుంది. హోంశాఖ అదనపు కార్యదర్శి నేతృత్వంలో ఈ బృందం ఆంధ్రప్రదేశ్ కు చేరుకుని వరద నష్టాన్ని అంచనా వేయనుంది. వరద బాధితులతో కేంద్ర బృందం నేరుగా మాట్లాడనుంది. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి జరిగిన నష్టాలను చూడనుంది.
వరద బాధితులతో...
క్షేత్రస్థాయిలో పర్యటించి కేంద్రానికి వరద నష్టం అంచనాల వివరకాలను నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందచేయనుంది. ప్రకాశం బ్యారేజీని కూడా పరిశిలించే అవకాశముంది. ఏపీకి కేంద్ర బృందాన్ని పంపుతున్న ప్రధాని నరేంద్ర మోదీకి, హోంశాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.