ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ముందే ఉగాది పండగ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.;

Update: 2025-03-25 01:53 GMT
chandrababu naidu,  government, good news, government employees
  • whatsapp icon

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు క్లియర్ చేసింది. పెండింగ్ లో ఉన్న 1000 కోట్ల రూపాయల ఏపీజీఎల్ఐ బిల్లులులను ప్రభుత్వం క్లియర్ చేస్తుంది. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన బకాయీలు క్లియర్ చేయడానికి ఆరు వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని ఆర్థికశాఖను ఆదేశించిన సంగతి తెలిసిందే.

బకాయీలను చెల్లిస్తూ...
ఈ నేపథ్యంలోనే ఎంప్లాయీస్ కు బకాయీ పడిన పెండింగ్ బిల్లును ప్రభుత్వం క్లియర్ చేస్తుంది. 2500 కోట్ల రూపాయలను జీపీఎఫ్ ఖాతాల్లో ఆర్థిక శాఖ వేస్తుంది. అలాగే 2300 కోట్ల రూపాయల సీపీఎస్ S కంట్రిబుషన్ మొత్తం క్రెడిట్ అవుతునట్లు కూడా అధికారులు తెలియజేయడంతో ఏపీ ఉద్యోగులు ఖుషీ అవుతున్నారు. రిటైర్ అయిన వారికి ప్రయోజనాలు కూడా అందుతున్నాయి. విధుల్లో ఉన్న ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నారు.


Tags:    

Similar News