సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి ఖరారైనట్లే

రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సొంత నియోజకవర్గం ఇది. 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రత్యర్థి,

Update: 2023-06-01 05:20 GMT

సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లే..! మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ అభ్యర్థి ఎవరనే విషయమై ఇన్ని రోజులూ కాస్త సస్పెన్స్ కొనసాగినా.. కన్నా లక్ష్మీనారాయణ తప్ప ఇంకెవరూ కాదని అందరికీ అర్థం అయిపోయింది. టీడీపీ అధినాయకత్వం సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జిగా కన్నాను నియమించింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా కన్నా లక్ష్మీనారాయణను నియమించినట్టు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో వెల్లడించారు. మంత్రి అంబటికి దీటైన అభ్యర్థి కన్నానే అని టీడీపీ భావిస్తున్నట్టు దీంతో స్పష్టమైంది. కన్నా ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఎన్నికలకు మరికొన్ని నెలల సమయమే ఉండడంతో నియోజకవర్గాల వారీగా ఇన్చార్జిల నియామకంలోనూ దూకుడు పెంచింది. సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి రేసులో జీవీ ఆంజనేయులు, కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామకృష్ణ కూడా ఉన్నట్టు ప్రచారం జరిగింది. అయితే, టీడీపీ నాయకత్వం కన్నా వైపు మొగ్గు చూపించింది.

రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సొంత నియోజకవర్గం ఇది. 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోడెల శివప్రసాద్ రావును 20 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. కోడెల కన్నుమూసిన తరువాత ఆయన కుమారుడు శివరాంకు టికెట్ లభిస్తుందనే ఊహాగానాలు నడిచాయి. అయితే ఊహించని విధంగా సత్తెనపల్లి నియోజకవర్గం బాధ్యతలను మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు అప్పగించింది తెలుగుదేశం పార్టీ. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థిగా కన్నా పోటీ చేయడం దాదాపుగా ఖాయమైనట్టేనని అనుకుంటూ ఉన్నారు. ఇక కన్నా మిగిలిన నాయకుల మద్దతు కూడగట్టుకుంటారా అనేది కాలమే నిర్ణయిస్తుంది.


Tags:    

Similar News