బ్రేకింగ్.. వచ్చే సోమవారానికి వాయిదా

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది

Update: 2023-10-03 08:14 GMT

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సోమవారం లోపు సమర్పించాలని సీఐడీ న్యాయవాదికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేశారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ సాగింది. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి లేకుండా తనపై నమోదయిన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలంటూ ఆయన సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదీలతో కూడిన ధర్మానసం ఈ పిటీషన్ ను విచారించింది. చంద్రబాబు ఈ కేసులో అరెస్టయి గత 25 రోజుల నుంచి రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
ఇక అంగళ్లు అల్లర్ల కేసులో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురయింది. ఈ కేసులో నిందితులకు ఏపీ హైకోర్టు బెయల్ మంజూరు చేయడాన్ని సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును సమర్థించింది. ఈ పిటిషన్ ను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ విషయంలో జోక్యం చేసుకోబోమని సుప్రీం స్పష్టం చేసింది.


Tags:    

Similar News