చంద్రబాబు నాయుడును విచారించేది వీరే

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై, రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును

Update: 2023-09-23 03:07 GMT

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై, రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును 9 మంది సీఐడీ అధికారులు శని, ఆదివారాల్లో విచారించనున్నారు. రెండు రోజుల పాటు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించనున్నారు. ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రత్యేక గదిలో ఈ విచారణ జరగనుంది. కేసు విచారణాధికారి సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలో విచారణ జరగనుంది. విచారణ సందర్భంగా చంద్రబాబు తరఫున న్యాయవాదులను అనుమతిస్తారు. చంద్రబాబును విచారించనున్న తొమ్మిది మంది అధికారుల్లో... ఎం ధనుంజయనాయుడు (డీప్యూటీ ఎస్పీ), విజయ భాస్కర్ (డిప్యూటీ ఎస్పీ), లక్ష్మీ నారాయణ (డిప్యూటీ ఎస్పీ), ఇన్స్‌పెక్టర్లు మోహన్ కుమార్, రవి కుమార్, శ్రీనివాసన్, సాంబశివరావు, ఏఎస్ఐ రంగనాయకులు, పీసీ సత్యనారాయణ ఉన్నారు. వీరితో పాటు ప్రొఫెషనల్ వీడియో గ్రాఫర్, ఇద్దరు మీడియేటర్లు ఉంటారు.

శనివారం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ చంద్రబాబు నాయుడును ప్రశ్నిస్తారు. మధ్యలో ఓ గంట భోజనం కోసం విరామం ఇస్తారు. విచారణ జరిగే సమయంలో చంద్రబాబు, సీఐడీ తరపున న్యాయవాది ఉంటారు. డీఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో విచారణ ప్రక్రియ జరుగుతుంది. గంటకోసారి అయిదు నిమిషాల విరామమిచ్చి తన తరపున న్యాయవాదిని సంప్రదించుకునేందుకు చంద్రబాబుకు అవకాశం ఉంటుంది. విచారణను సీఐడీకి చెందిన వీడియోగ్రాఫర్‌తో మాత్రమే రికార్డు చేయించాలని, ఆ వీడియో మొత్తాన్ని సీల్డ్‌కవర్‌లో న్యాయస్థానానికి సమర్పించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. విచారణకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఏవీ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడును ప్రశ్నించేందుకు పలు ప్రశ్నలను సిద్ధం చేశారు అధికారులు.


Tags:    

Similar News