Chandrababu : ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు ఏమన్నారంటే?

ఎన్డీఏతో తెలుగుదేశం పార్టీ అనుబంధం ఈనాటిది కాదని చంద్రబాబు అన్నారు

Update: 2024-06-07 07:52 GMT

ఎన్డీఏతో తెలుగుదేశం పార్టీ అనుబంధం ఈనాటిది కాదని చంద్రబాబు అన్నారు. ఎన్డీఏ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుదీర్ఘకాలం నుంచి ఎన్డీఏతో తెలుగుదేశం పార్టీ కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. ఎన్డీఏను మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆయన సల్పిన కృషి అనన్య సామాన్యమన్నారు. అందుకోసం రేయింబవళ్లూ కష్టపడ్డారన్నారు. సరైన సమయంలో భారత్ కు సరైన నాయకత్వం దొరికిందని చంద్రబాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో మోదీ పడిన కష్టాన్ని చూసి తాను ఆనాడే ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని భావించానని అన్నారు.

భారత ఆర్థిక వ్యవస్థను...
ఏపీలోనూ మూడు బహిరంగసభలు, ఒక రోడ్ షోలో ఆయన పాల్గొన్నారన్నారు. మోదీ దూరదృష్టి కలిగిన నేత అని అన్నారు. ప్రపంచంలోనే భారత్ ను అత్యంత శక్తిమంతమైన దేశంగా తీర్చిదిద్దడంలో మోదీ ఈ పదేళ్లు పనిచేశారన్నారు. విజనరీ ఉన్న నాయకుడు మోదీ అని అన్నారు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి మోదీయే కారణమని ఆయన తెలిపారు. ప్రపంచంలో భారతీయులు అత్యంత సంపాదనపరులుగా తయారయ్యంటే అది ప్రధాని చేసిన కృషి కారణమని, ఆయన తీసుకున్న నిర్ణయాలని చెప్పారు. ఎన్డీఏతో తమ ప్రయాణం కొనసాగుతుందని, తాము మోదీని ప్రధానిగా ప్రతిపాదిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.


Tags:    

Similar News