జగన్ కు ఐటీ శాఖ క్లీన్ చిట్ పై చంద్రబాబు ఏమన్నారంటే?
జగన్ సంస్థల్లో అక్రమ పెట్టుబడులు లేవంటూ ఐటీ శాఖ కితాబిచ్చిందన్న వార్తలపై చంద్రబాబు స్పందించారు.;
జగన్ సంస్థల్లో అక్రమ పెట్టుబడులు లేవంటూ ఐటీ శాఖ కితాబిచ్చిందన్న వార్తలపై చంద్రబాబు స్పందించారు. ఐటీ శాఖకు పన్ను కడితే అవినీతి లేనట్లేనా? అని ఆయన ప్రశ్నించారు. జగన్ రూపాయి పెట్టుబడి లేకుండా 1200కోట్లు పెట్టుబడులు తెచ్చుకోవడం అవినీతి కాదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టి చట్ట సవరణను చేయాల్సి ఉంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జగన్ ది అవినీతి కాదంటే దేశంలో ఒక్క అవినీతి పరుడిని కూడా పట్టుకోలేమని చంద్రబాబు అన్నారు.
టాలీవుడ్ నాకు సహకరించేలేదు
ిసినిమా టిక్కెట్ల ధరల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు తెలుగు సినిమా ఇండ్రస్ట్రీ మద్దతిస్తుందని చెప్పడం అర్ధరహితమని తెలిపారు. తాను ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలోనే తనకు వ్యతిరేకంగా సినిమాలు తీశారని ఆయన చెప్పుకొచ్చారు. అయినా తాము ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు దిగలేదని తెలిపారు. సినిమా టిక్కెట్ల వివాదంలోకి టీడీపీని లాగడం ఎందుకుని చంద్రబాబు ప్రశ్నించారు.
చిరంజీవి పార్టీ పెట్టకుంటే....?
2009లో చిరంజీవి పార్టీ పెట్టకుంటే అప్పడే తాము అధికారంలోకి వచ్చేవారమని తెలిపారు. అయినా తాను మనసులో పెట్టుకోలేదని, చిరంజీవితో నేడు కూడా సఖ్యతను కొనసాగిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. టీడీపీకి ఎప్పుడూ సినిమా పరిశ్రమ సహకరించలేదని తెలిపారు.