సత్యసాయి జిల్లాలో రోడ్డుపై చిరుత

సత్యసాయి జిల్లాలో చిరుత రోడ్డుపై పడి ఉంది. వాహనం ఢీకొట్టడంతో గాయపడిన చిరుతను స్థానికులు చూసి అధికారులకు సమాచారమిచ్చారు;

Update: 2024-02-06 03:06 GMT
సత్యసాయి జిల్లాలో రోడ్డుపై చిరుత
  • whatsapp icon

సత్యసాయి జిల్లాలో చిరుత రోడ్డుపై పడి ఉంది. వాహనం ఢీకొట్టడంతో అది గాయపడి ఉండగా స్థానికులు చూసి అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో ఘటన స్థలికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు కొన ప్రాణంతో ఉన్నట్లు గుర్తించి చిరుతను ఆసుపత్రికి తరలించారు. చిరుతలు తరచూ రోడ్డు దాటుతుండగా ప్రమాదాలకు గురవుతున్నాయి.

వాహనం ఢీకొట్టడంతో...
వాహనం ఢీకొట్టడంతో అది గాయపడి రోడ్డుపైనే పడి ఉండటాన్ని గమనించిన కొందరు వాహనదారులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడం వల్లనే దానిని రక్షించగలిగామని అధికారులు చెబుతున్నారు. చిరుత కొంత కోలుకుంటుందని చెప్పారు. వాహనదారులు పరిమితికి మించి వేగంలో వెళ్లవద్దని సూచిస్తున్నారు.


Tags:    

Similar News