జస్టిస్ కు గ్రామస్థుల సాదర స్వాగతం
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తన స్వగ్రామమైన పొన్నవరం లో పర్యటిస్తున్నారు. ఆయనకు ప్రజలు సాదరంగా స్వాగతం పలికారు.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తన స్వగ్రామమైన పొన్నవరం లో పర్యటిస్తున్నారు. ఆయనకు గ్రామ ప్రజలు సాదరంగా స్వాగతం పలికారు. ప్రత్యేకంగా అలంకరించిన ఎడ్లబండిపై జస్టిస్ ఎన్వీ రమణ దంపతులను ఊరేగిపుంగా మేళతాళాల మధ్య గ్రామంలోకి తీసుకెళ్లారు. చీఫ్ జస్టిస్ గా నియమితులైన తర్వాత తొలిసారి జస్టిస్ ఎన్వీరమణ స్వగ్రామానికి రావడంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నాలుగు గంటల పాటు...
ఆయనకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో తమ తీపి గుర్తులను నెమరువేసుకుంటున్నారు. ఎన్వీ రమణ గ్రామంలో చదివిన పాఠశాలను కూడా ప్రత్యేకంగా అలంకరించారు. జస్టిస్ ఎన్వీ రమణ చిన్నానాటి స్నేహితులను ఆయన పేరు పెట్టి మరీ పిలిచి దగ్గరకు తీసుకున్నారు. పొన్నవరం గ్రామంలో నాలుగు గంటల పాటు ఉండే జస్టిస్ ఎన్వీరమణ తర్వాత గుంటూరు బయలుదేరి వెళతారు.