Chandrababu : తిరుపతిలో గ్యాస్ లైన్ ప్రారంభించిన చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుచానూరులో ఇంటింటికీ పైపులైన్ ద్వారా గ్యాస్ పంపిణీ పథకాన్ని ప్రారంభించారు;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతికి చేరుకున్నారు. ఆయన తిరుచానూరులో ఇంటింటికీ పైపులైన్ ద్వారా గ్యాస్ పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. తిరుపతిలో ఒక ఇంట్లో ఈ పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు వారితో కాసేపు ముచ్చటించారు. తిరుపతికి చేరుకున్న చంద్రబాబుకు పార్టీ నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు.
నారావారిపల్లికి...
తిరుపతిలో ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆయన నేరుగా తన స్వగ్రామమైన నారావారిపల్లికి చేరుకుంటారు. అక్కడే మూడు రోజుల పాటు ఉంటారు. సంక్రాంతి వేడుకల్లో చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొననున్నారు. నారావారిపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.