Cabinet Meeting : మంత్రి వర్గ సమావేశంలో చంద్రబాబు సీరియస్

మంత్రి వర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు

Update: 2024-12-03 12:03 GMT

మంత్రి వర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. బ్యూరోక్రసీ ఇంకా గాడిలో పడలేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జలజీవన్ మిషన్ వినియోగంలో జాప్యం జరుగుతుందని అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసంతృప్తి చెందారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టును సద్వినియోగం చేసుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమయిందని తెలిపారు. డీపీఆర్ స్థాయి దాటి ముందుకు వెళ్లలేదని అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీలోనూ ఈ విషయం ప్రచారం జరుగుతుందనితెలిపారు. బ్యూరోక్రసీ వల్లనే పనులు సక్రమంగా జరగడం లేదని అన్నారు.

మంత్రులు ఎందుకున్నట్లు...?
ప్రభుత్వం ఏర్పాటయి ఆరు నెలలు కావస్తుందని, పనితీరుపై నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎవరెవరు ఏం చేశారో సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. దీంతో పాటు కొందరు మంత్రులపై కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పనితీరును మెరుగుపర్చుకోవాలని, శాఖలపై అవగాహన ఇంకా పెంచుకోవాలని కోరారు. అలాగే జిల్లా ఇన్ ఛార్జి మంత్రులు మూడు పార్టీల నేతల మధ్య నియోజకవర్గాల్లో సమన్వయం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో ఇన్ ఛార్జి మంత్రుల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.


Tags:    

Similar News