Chandrababu : వాలంటీర్లకు చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పినట్లేనా?

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాలంటీర్ల వ్యవస్థపై కీలక కామెంట్స్ చేశారు.;

Update: 2024-10-01 12:24 GMT

 chandrababu naidu 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాలంటీర్ల వ్యవస్థపై కీలక కామెంట్స్ చేశారు. ఈరోజు పింఛన్ల పంపిణీ సందర్భంగా కర్నూలు జిల్లా పుచ్చకాయలమడలో నిర్వహించిన గ్రామసభలో ప్రసంగించిన చంద్రబాబు వాలంటీర్లు లేకుంటే పింఛన్ల పంపిణీ జరగదన్నారు. కానీ తమ ప్రభుత్వం వారు లేకుండానే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని గత నాలుగు నెలలులగా ప్రతి నెల ఒకటో తేదీన పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అయితే వాలంటీర్ల వ్యవస్థను ఏం చేయాలన్న దానిపై ఆలోచన చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

దీపావళి నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు...
కర్నూలులో హైకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మెరుగైన మద్యాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. నాణ్యత కలిగిన అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత గ్యాస్ సిిలిండర్ పంపిణీని దీపావళి రోజున ప్రారంభిస్తామని చంద్రబాబు తెలిపారు. మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తామని చంద్రబాబు మరోసారి ప్రకటించారు.


Tags:    

Similar News