Chandrababu : ఏపీలో నూతన క్రీడాపాలసీపై చంద్రబాబు సమీక్ష

ఆంధ్రప్రదేశ్ లో నూతన క్రీడా విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు;

Update: 2024-11-04 12:37 GMT

chandrababu

ఆంధ్రప్రదేశ్ లో నూతన క్రీడా విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. స్పోర్ట్స్‌ ఫర్‌ ఆల్‌ పేరుతో క్రీడా విధానాన్ని అధికారులు రూపొందించారు. పబ్లిక్, ప్రయివేటు పార్టనర్‌షిప్ విధానంలో స్టేడియాలు, సంస్థల సహకారంతో క్రీడా ప్రాంగణాల అభివృద్ధిపై చర్చ ఈ సమావేశంలో జరిగిందని తెలిపారు.

ప్రోత్సహాకాలను...
ఒలింపిక్స్‌, ఏషియన్స్‌ గేమ్స్‌లో పతకాలు పొందేవారికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని భారీగా పెంచాలని ప్రతిపాదనను అధికారులు చంద్రబాబు నాయుడు ముందుంచారు. సమగ్ర క్రీడా విధానంపై సీఎంకు ప్రజెంటేషన్‌ ను అధికారులు ఇచ్చారు. రాష్ట్రంలో క్రీడలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించాలని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News