ఆ అధికారులను ఎవరినీ వదలిపెట్టేది లేదు.. చంద్రబాబు వార్నింగ్
అవినీతికి కారకులైన అధికారులను ఎవరినీ వదిలిపెట్టేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
అవినీతికి కారకులైన అధికారులను ఎవరినీ వదిలిపెట్టేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రతి గ్రామంలో భూకుంభకోణాలు జరిగాయని తెలిపారు. ఎక్కువగా రెవెన్యూ సంబంధితమైన సమస్యలే తమ వద్దకు అధికంగా ఫిర్యాదు రూపంలో వస్తున్నాయని తెలిపారు.
రెవెన్యూ సమస్యలే...
ప్రజలు ఎక్కువగా భూములకు సంబంధించిన బాధితులేనని తెలిపారు. ప్రతి మండలంలోనూ వైసీపీ నేతలు భూకుంభకోణానికిపాల్పడ్డారన్నారు. రికార్డులను కూడా పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకున్నారని తెలిపారు. అందుకు బాధ్యులైన వారిని ఎవరినీ వదిలపెట్టే ప్రసక్తి లేదని చంద్రబాబు హెచ్చరించారు.