నేడు పార్టీ కార్యాలయానికి చంద్రబాబు
ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు.
ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. పార్టీ కార్యాలయంలో ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించనున్నారు. చంద్రబాబు రాక సందర్భంగా కార్యాలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజల నుంచి వినతలను స్వీకరించడంతో పాటు ముఖ్యనేతలతో కూడా చంద్రబాబు మాట్లాడనున్నారు.
సభ్యత్వ నమోదుతో పాటు...
దీంతోపాటు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమంపై నేతలతో చర్చించనున్నారు. టీడీపీ సభ్యత్వ నమోదులో ఏ నియోజకవర్గంలో బాగా చేశారు? ఎక్కడ వెనకబడ్డారు? అన్న అంశాలపై నేతలతో చర్చిస్తారు. దీంతో పాటు ఆరు నెలల కూటమి ప్రభుత్వం తీరుపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను నేతలను చంద్రబాబు అడిగి తెలుసుకోనున్నారు.