జగన్ పుట్టిన రోజుకు నేతలందరూ?

ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు నేడు. పార్టీ నేతలందరూ తమ అధినేత పుట్టిన రోజు వేడుకలను విన్నూత్నంగా జరుపుకుంటున్నారు;

Update: 2021-12-21 02:18 GMT

ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు నేడు. పార్టీ నేతలందరూ తమ అధినేత పుట్టిన రోజు వేడుకలను విన్నూత్నంగా జరుపుకుంటున్నారు. శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అయితే సముద్రంలోకి వెళ్లి జగన్ కు ముందుగానే శుభాకాంక్షలు తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు జగన్ పుట్టిన రోజు సందర్భంగా అన్నదానాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటు కుంటున్నారు.

చెవిరెడ్డి వినూత్నంగా....
ఇక ఎమ్మెల్యేలు కూడా తమకు తోచిన రీతిలో జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డ ిభాస్కర్ రెడ్డి తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలోని గోశాల వద్ద టూ డీ టెక్నాలజీ తో జగన్ ఫొటోను రూపొందించారు. ఆర్గానికి జగన్ చిత్రాన్ని ప్రముఖ ఆర్టిస్ట్ కాంత్ రీషా రూపొందించారు. పది రోజుల నుంచి ఈ చిత్రం కోసం శ్రమపడినట్లు చెబుతున్నారు.


Tags:    

Similar News