నేడు చంద్రబాబు షెడ్యూల్ ఇదే

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది;

Update: 2024-10-23 03:31 GMT

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. ఈరోజు ఉదయం 11 గంటలకు సచివాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు. సచివాలయంలోని మొదటి బ్లాక్ లోని మొదటి అంతస్తులో మంత్రి వర్గ సమావేశంలో ఆయన పాల్గొంటారు.మధ్యాహ్నం వరకూ మంత్రి వర్గ సమావేశం జరగనుంది.

ఇరిగేషన్ శాఖపై సమీక్ష...
అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు సాయంత్రం నాలుగు గంటలకు ఇరిగేషన్ శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. ఆ తర్వాత జల్ జీవన్ మిషన్ పై కార్యక్రమంపై రివ్యూ చేయనున్నారు. సాగునీటి కాల్వల నిర్వహణ, ప్రాజెక్టుల పరిస్థితి, వరదలతో నీరు చేరిన ప్రాజెక్టుల వద్ద స్థితిని గురించి సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకోనున్నారు.


Tags:    

Similar News