చల్లా కుటుంబానికి అండగా ఉంటాం
ఎమ్మెల్సీ చల్లా భగీరధరెడ్డి అకాల మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
ఎమ్మెల్సీ చల్లా భగీరధరెడ్డి అకాల మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భగీరధ చురుకైన నాయకుడని జగన్ అన్నారు. తండ్రి మరణించడంతో చిన్న వయసులో కుటుంబానికి అండగా నిలబడ్డారని జగన్ అన్నారు. తండ్రి చల్లా రామకృష్ణారెడ్డితో పాటు భగీరధ రెడ్డి చేసిన సేవలను జగన్ గుర్తుకు చేసుకున్నారు.
చురుకైన నేతగా...
పార్టీలో భగీరధ రెడ్డి చురుగైన నాయకుడిగా వ్యవహరించారన్నారు. మంచి భవిష్యత్ ఉన్నప్పటికీ అకాల మరణం తనను కలచి వేసిందని జగన్ అన్నారు. ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు. చల్లా కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని అన్నారు.