ఎంపీ గోరంట్లపై జగన్ సీరియస్

హిందూపురం పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గా తీసుకున్నారు

Update: 2022-08-04 12:06 GMT

హిందూపురం పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గా తీసుకున్నారు. మాధవ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం కల్పిస్తుంది. ఈ వివాదంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. నిజమని తేలితే అందరికీ గుణపాఠంలా అనిపించేలా చర్యలు ఉంటాయని సజ్జల అన్నారు. ఇలాంటి పనులను చేసే ఏ వ్యక్తిని పార్టీ ప్రోత్సహించదని ఆయన చెప్పారు.

మార్ఫింగ్ కాదని తేలితే...
గోరంట్ల మాధవ్ వీడియో మార్ఫింగ్ కాదని తేలితే ఆయన పై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేవఆరు. ఇలాంటి వాటిని పార్టీ సహించదని పేర్కొన్నారు. అయితే గోరంట్ల వాదనను కూడా పరిగణనలోెకి తీసుకుని దీనిపై పోలీసులు విచరణ జరుపుతారని, పోలీసుల నుంచి వచ్చిన తర్వాత మాధవ్ పై చర్యలు ఉంటాయని సజ్జల అన్నారు. మార్ఫింగ్ అని తేలితే నిందితులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆయన అన్నారు.


Tags:    

Similar News