"జావద్" పై జగన్ సమీక్ష
జావద్ తుపాను ముప్పు పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో సమీక్షించారు.;
జావద్ తుపాను ముప్పు పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో సమీక్షించారు. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి మూడు జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. జావద్ తుపాను కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో జగన్ సంబంధిత జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఆదేశించారు.
ముగ్గురు స్పెషల్ అధికారులు...
తుపాను కారణంగా ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల వారిని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. తుపాను కు మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారులను జగన్ నియమించారు. శ్రీకాకుళంకు అరుణ్ కుమార్, విజయనగరం జిల్లాకు కాంతిలాల్ దండే, విశాఖ జిల్లాకు శ్యామలరావును నియమించారు. వీరి పర్యవేక్షణలో సహాయ కార్యక్రమాలను చేపట్టాలని జగన్ ఆదేశించారు.