Ys Jagan : నేటి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డు
నేటి నుంచి ఆరోగ్య శ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ జరుగుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు.
నేటి నుంచి ఆరోగ్య శ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ జరుగుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. కొత్త ఫీచర్లతో ఆరోగ్య శ్రీ కార్డులను పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిమితిని ఇరవై ఐదు లక్షల రూపాయలకు పెంచుతూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లోనూ ఈ ఆరోగ్య శ్రీ కార్డు చెల్లుబాటు అవుతుందని జగన్ తెలిపారు. బయట రాష్ట్రాల్లో సూపర్ స్పెషాలిటీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.
ఆదాయ పరిమితితో పాటు...
ఏడాదికి ఐదు లక్షల రూపాయల ఆదాయం ఉన్న వారందరికీ ఆరోగ్య శ్రీ కార్డు అందచేయనున్నామని తెలిపారు. పేదవాడికి ఆరోగ్య శ్రీ సేవలను మరింత చేరువ చేయడానికే ఈ చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇది వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులని ఆయన అన్నారు. వైద్యం కోసం పేదవాడు ఇబ్బంది పడకూడదనే ఈ పథకం పరిమితిని పెంచుతున్నామని తెలిపారు. ఏ పేదవాడు తన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడం కోసం అప్పుల పాలు కాకూడదని జగన్ ఆకాంక్షించారు. 4.25 లక్షల మందికి ఆరోగ్య శ్రీని అందచేశామని ఆయన తెలిపారు. ఏటా 4,100 కోట్ల రూపాయలు ఈ పథకం కింద ఖర్చు చేస్తున్నామని తెలిపారు.