Ys Jagan : ఐ ప్యాక్ సంస్థ ప్రతినిధులకు జగన్ స్పెషల్ గిఫ్ట్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లనున్నారు. అక్కడ పనిచేస్తున్న వారితో కాసేపు మాట్లాడనున్నారు.;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లనున్నారు. అక్కడ పనిచేస్తున్న వారితో కాసేపు మాట్లాడనున్నారు. వారికి బహుమతులు అందచేయనున్నారు. ఈ ఎన్నికల్లో ఐప్యాక్ సంస్థ వివిధ నివేదికలను అందించడం ద్వారా కీలకమైన సమాచారాన్ని అధినాయకత్వానికి ఇచ్చింది. దీంతో పాటు అభ్యర్థుల ఎంపికలో కూడా ఐ ప్యాక్ సంస్థ ముఖ్యపాత్ర పోషించింది. అభ్యర్థులను వివిధ నియోజకవర్గాలలో మార్చడానికి కూడా ఐప్యాక్ సంస్థ ఇచ్చిన నివేదికలే కారణమంటారు.
కార్యాలయానికి చేరుకుని...
అయితే ఎన్నికలు పూర్తికావడంతో ఇప్పుడు వైసీపీ అధినేతగా జగన్ వారి వద్దకు వెళుతున్నారు. విజయవాడలోని బెంజి సర్కిల్ వద్ద ఉన్న ఆ కార్యాలయానికి జగన్ చేరుకుంటారు. వాళ్లు పార్టీ కోసం ఇన్నాళ్లు చేేసిన పనికి అభినందనలు తెలయజేయనున్నారు. ఐప్యాక్ సంస్థ ప్రతినిధులను తాను స్వయంగా అభినందించడానికే జగన్ అక్కడకు వెళుతున్నారు. పార్టీ కోసం పనిచేసినందుకు కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. ఐప్యాక్ సంస్థలో జగన్ దాదాపు ముప్పయి నిమిషాలు గడపనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.