రేపు ప్రకాశం జిల్లాకు జగన్

రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన చీమకుర్తిలో పర్యటిస్తారు;

Update: 2022-08-23 07:08 GMT

రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన చీమకుర్తిలో పర్యటిస్తారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. అనంతరం ఆయన అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. రేపు ఉదయం 9.45 గంటలకు ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరతారు. 10.55 గంటలకు చీమకుర్తి మెయిన్ రోడ్డులో ఉన్న బూచేపల్లి సుబ్బారెడ్డి కళ్యాణ మండపానికి చేరుకుంటారు.

కాంస్య విగ్రహాల ఆవిష్కరణ...
అక్కవ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను ఆవిష్కరిస్తారు. అనంతరం బీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళశాల వద్ద జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. తిరిగి మధ్యాహ్నం 12.40 గంటలకు చీమకుర్తి నుంచి బయలు దేరి 1.30 గంటలకు తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.


Tags:    

Similar News