రాజ్‌భవన్ కు ముఖ్యమంత్రి జగన్

కొత్త గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలిసేందుకు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి జగన్ రాజ్‌భవన్ కు వెళ్లనున్నారు.;

Update: 2023-02-23 03:15 GMT
రాజ్‌భవన్ కు ముఖ్యమంత్రి జగన్
  • whatsapp icon

కొత్త గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలిసేందుకు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి జగన్ రాజ్‌భవన్ కు వెళ్లనున్నారు. నూతన గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిసేందుకే జగన్ రాజ్‌ భవన్ కు వెళుతున్నారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

నిన్న విమానాశ్రయంలో...
నిన్న ఢిల్లీ నుంచి వచ్చిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఘనంగా స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి జగన్ తో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు సాదర స్వాగతం పలికరు. రేపు గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం బాధ్యతలను స్వీకరించనున్నారు.


Tags:    

Similar News