ఆ వీడియోకు... మాకు సంబంధం లేదు
తమను అనవసరంగా వివాదంలోకి రావద్దని చింతకాయల విజయ్ అన్నారు. ఒక ఎంపీ ఇలా వ్యవహరించడం సిగ్గు చేటని ఆయన అన్నారు.
తమను అనవసరంగా వివాదంలోకి రావద్దని చింతకాయల విజయ్ అన్నారు. ఒక ఎంపీ ఇలా వ్యవహరించడం సిగ్గు చేటని ఆయన అన్నారు. మాధవ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని విజయ్ డిమాండ్ చేశారు. ఎంపీగా ప్రజలు గెలిపించింది ఇలాంటి పనులు చేయడం కోసమేనా? అని చింతకాయల విజయ్ నిలదీశారు. తమ పేర్లను అనవసరంగా వివాదంలోకి లాగుతున్నారని ఆయన తెలిపారు. తమకు ఆ వీడియోతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. తన పేరు ప్రస్తావించినందున తాను గోరంట్ల మాధవ్ పై పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు.
నిజమైతే చర్యలు తీసుకోండి...
ప్రజా సమస్యలపై చర్చించాల్సిన ఒక ఎంపీ ఇలా సిగ్గుపడే విధంగా వ్యవహరించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో కాకుండా ఇంకా జిమ్ వీడియో అంటూ బుకాయిస్తున్నారని చింతకాయల విజయ్ అన్నారు. వీడియో ఫేక్ అనేదా? కాదా? అన్నది తేలాలంటే ముఖ్యమంత్రి జగన్ దీనిపై విచారణ చేయించాలని కోరారు. ప్రభుత్వం వారి చేతిలో ఉందని కాబట్టి వారే దీనిపై విచారణ చేయించుకోవాలని చింతకాయల విజయ్ అన్నారు. అసలు గోరంట్ల మాధవ్ ఎవరో తనకు తెలియదని, అతనిని తాను పట్టించుకోనని కూడా విజయ్ పేర్కొన్నారు.