అత్యల్ప ఉష్ణోగ్రతలు... మన్యం మసకబారింది

విశాఖ ఏజెన్సీ ప్రాంతమైన చింతపల్లిలో ఈరోజు 7.5 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Update: 2022-02-02 03:31 GMT

విశాఖ ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. దీంతో చలి గాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. గత కొద్ది రోజులుగా విశాఖ ఏజెన్సీలో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలికి బయటకు రావాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. ఉదయం పదకొండు గంటల వరకూ ఎండ తగలకోవడంతో ప్రజలు జలుబు, దగ్గు వంటి వాటితో బాధపడుతున్నారు. మరికొద్ది రోజులు ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది.

చింతపల్లిలో....
విశాఖ ఏజెన్సీ ప్రాంతమైన చింతపల్లిలో ఈరోజు 7.5 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మినుములూరు, అరకు ప్రాంతంలోె పది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఈ ప్రాంత ప్రజలు చలికి వణికిపోతున్నారు. ఫిబ్రవరి నెల వచ్చినా చలిగాలుల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. పొగమంచుతో వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పది గంటల వరకూ పొగమంచు వీడటం లేదు.


Tags:    

Similar News