మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు
టెన్త్ ఎగ్జామ్ కేసులో మాజీ మంత్రి నారాయణ బెయిల్ ను రద్దు చేస్తూ చిత్తూరు కోర్టు తీర్పు చెప్పింది.
టెన్త్ ఎగ్జామ్ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణ బెయిల్ ను రద్దు చేస్తూ చిత్తూరు కోర్టు తీర్పు చెప్పింది. చిత్తూరు జిల్లా 9వ అదనపు కోర్టు తీర్పు చెప్పింది. నవంబరు 30వ తేదీలోపు న్యాయస్థానంలో హాజరు కావాలని ఆదేశించింది. టెన్త్ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ మాజీ మంత్రి నారాయణపై చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనను అప్పట్లో అరెస్ట్ కూడా చేశారు.
మరోసారి విచారించేందుకు...
అయితే ఆయనకు న్యాయస్థానం అప్పట్లో బెయిల్ మంజూరు చేసింది. కేసు విచారణ నిమిత్తం నారాయణను అదుపులోకి తీసుకునేందుకు చిత్తూరు పోలీసులు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రభుత్వం తరుపున అడ్వొకేట్ జనరల్ తన వాదనను వినిపించారు. దీంతో మాజీ మంత్రి నారాయణ బెయిల్ ను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. నవంబరు 30 లోపు కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. అయితే ఆయన హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ ను తెచ్చుకునే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు.