Kakinada Port : కాకినాడ పోర్టు స్వాధీనంపై సీఐడీ కేసు నమోదు

కాకినాడ పోర్టు స్వాధీనంపై గత ప్రభుత్వంలో జరిగిన ఘటనపై సీఐడీ కేసు నమోదు చేసింది

Update: 2024-12-04 03:09 GMT

కాకినాడ పోర్టు స్వాధీనంపై గత ప్రభుత్వంలో జరిగిన ఘటనపై సీఐడీ కేసు నమోదు చేసింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిపై సీఐడీ అధికారులకు కేవీ రావు సీఐడీకి ఫిర్యాదు చేశారు. కాకినాడ పోర్టుతో పాటు సెజ్ లోని 3,600 కోట్ల విలువైన వాటాను తీసుకునేందుకు తనపై వత్తిడి తెచ్చారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమను బెదిరించి, తమ మాట వినకపోతే జైలుకు పంపుతామని చెప్పి 2,500 కోట్ల విలువైన వాటాలను, 494 కోట్లకు కాకినాడ సీ పోర్టులో స్వాధీనం చేసుకున్నారని చెప్పారు.

బలవంతంగా తీసుకున్నారని...
కాకినాడ సెజ్ లోని 1,109 కోట్ల విలువైన వాటాలను పన్నెండు కోట్లకు బలవంతంా అరబిందో సంస్థకు బదలాయించుకున్నారని కూడా బాధితుడు కేవీ రావు సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తంగా మూడు వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను తమ స్వాధీనం చేసుకున్నారని, బలవంతంగానే వాటిని తీసుకున్నారని తెలిపారు. కేవీరావు ఫిర్యాదుతో వైవీ సుబ్బారెడ్డి కుమారుడైన విక్రాంత్ రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డి, పీకేఎఫ్ శ్రీధర్అండ్ సంతానం ఎల్ఎల్ పి ఆడిట్ సంస్థలు, అరబిందో రియాల్టీ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కు సంబంధించి డైరెక్టర్లను కూడా ఈ కేసులో నిందితులుగా సీఐడీ చేర్చింది.



Tags:    

Similar News